మనము మరణించినప్పుడు ఏమి జరుగుతుంది?

మనము మరణించినప్పుడు ఏమి జరుగుతుంది?

చాలా మంది ప్రజలు మరణము తరువాత ఏమి జరుగుతుందని ఆందోళనగా ఉంటారు. కొంతమంది మరణము అనేది జీవితానికి ఖచ్చితమైన ముగింపు అని చెబుతారు, కావున, వారు పర్యవసానములను గూర్చిన భయములేని జీవితమును జీవిస్తారు. ప్రజలు ఇప్పుడు సరియైన రీతిలో జీవించుట చేత మరణము తరువాత వచ్చు తీర్పు కొరకు సిద్ధపడాలని మరికొందరు చెప్తారు.

మరణము తరువాత తీర్పు మరియు జీవితము ఉండును

బైబిలు దేవుడు ఉన్నాడని మరియు ఇక్కడి మన భౌతికమైన, కంటికి కనబడు మండలమునకు వేరుగానున్న జీవముగా ఇప్పుడు కూడా ఉన్నాడని బైబిలు మనకు చెప్పుచున్నది. మనము చూడగలిగినది తాత్కాలికమైనది మరియు మనము చూడలేని దేవుని చేత సృజింపబడినది (2 కొరింథీయులకు 4:18). నిత్యుడైన మరియు కానరాని దేవుడు, ఒక ఉద్దేశము కొరకు, కనిపించు వాటిని, భూమిని, వృక్షములను, జంతువులను మరియు మానవులను సృజించెను(ఎఫెసీ 3:9,11), (కొలస్సీ 1:16), (1 తిమోతి 1:17). దేవుడు నిత్యత్వపు మండలములో ఉన్నట్లుగా, రాబోవుచున్న దేవుని తీర్పు చేత నిశ్చయించబడు మరణము తరువాతి జీవితము కూడా ప్రస్తుతము కనిపించుచున్న మండలమునకు తరువాత ఉండును (హెబ్రీ 9:27).

మరణము తరువాతి జీవితమునకు చెందిన రెండు ప్రధాన గుర్తులు

1) సృష్టిని చేయుటలో గల దేవుని ఉద్దేశాన్ని ఎవరైతే నెరవేర్చుదురో, అనగా క్రీస్తు వారి పాపముల కొరకు మరణించాడని మరియు వారిని నీతిమంతులుగా తీర్చడానికి పునరుత్థానుడయ్యాడని విశ్వసించెదరో ఆయనతో ఒక్కటగుటకు దేవుని వారిలోనికి జీవముగా తీసుకుంటారో, వారు దేవునితో ఉంటారు, దేవునితో ఒక్కటవుతారు, మరియు సమస్తభూమినీ దేవునితో కలిసి పరిపాలిస్తారు. (యోహాను 3:16-18) ఇది ఒకరు చనిపోయిన తరువాత జరుగుటకు సాధ్యపడు ఉత్తమమైన విషయము.

2) నేడు దేవుని కలిగిలేని వారు నిత్యత్వమంతయు ప్రేమించు దేవునికి దూరముగా ఉంటారు. వారు అగ్ని గుండములో నొప్పిని అనుభవిస్తారు, వారు సాతాను (అపవాది), అతని పతనమైన దూతలతో కూడా కాల్చివేయబడతారు. (యోహాను 3:16-18) అగ్నిగుండము మానవుల కొరకు కాదు గాని సాతాను, వాడి దూతల కొరకు సిద్ధపరచబడింది. అయినప్పటికీ, ఆదాము యొక్క పతనము ఫలితముగా మానవజాతియంతయు సాతానుతో ఒక్కటయ్యారు. కొంతమందికి  హెచ్చరికలివ్వబడినా మరియు అవకాశములివ్వబడినప్పటికీ దేవుని వైపుకు తిరుగరు గనుక, దేవుడు నిత్యత్వమంతయు వారు సాతానుతో ఉండుటకు, వాడి వేదనను పంచుకోవడానికి వదిలివేయవలెను. ఇది మృతి తరువాత ఉండు అత్యంత నీచమైన జీవితమైయుండును. ఎంతమందికి సాధ్యమైతే అంతమంది మరిముఖ్యముగా దీనిని చదువుతున్న మీరు దేవుని వైపుకు తిరుగుతారని, విడిచిపెట్టబడతారని మేము ఆశిస్తున్నాము.

నీవు ఎటువంటి రకమును కలిగియుంటావు అనుదానిని నిర్దేశించు కారకము

రాబోవుచున్న  తీర్పును ఎదుర్కొనుటకు సిద్ధపడు జీవితమును జీవించడానికిగాను, మొదటిగా ఏ విషయము బహుమతిని పొందుకొనునట్లు చేయును మరియు ఏ విషయము నిరాకరించబడుతుందని మనము కనుగొనవలెను. చాలా మంది ప్రజలు ఒక వ్యక్తి తాను భూమిమీద జీవించినంతకాలము మంచి కార్యములు జరిగిస్తే పరలోకమునకు వెళతాడని, అదే విధంగా ఒక వ్యక్తి దుష్టకార్యములు జరిగిస్తే అతడు పాతాళమునకు వెళతాడనే తప్పుభావనను కలిగియుంటారు. ఈ భావన బైబిలు ప్రకారమైనది కాదు. నీవు గనుక మరణానంతరముండు రెండురకములైన జీవనములను గూర్చి శ్రద్ధగా చదివినట్లైతే, నీవు కొంత బేధమును చూచెదవు. భూమిపై ఉన్నప్పుడు ఒకని ప్రవర్తన నిత్యత్వమంతయు ఒకని జీవనము ఏ రకముగా ఉండును అని నిర్ధారించు కారకము కాదు గానీ ఒకడు క్రీస్తుని మరణమును మరియు పునరుత్థానమును విశ్వసించెనో లేదో మరియు దేవుని జీవమును పొందుకొనెనో లేదో అనునదే నిర్ధారించు కారకముగా ఉండును. (యోహాను. 3:16-18).

మానవుని సమస్య

ఆయనను కలిగియుండడానికి దేవుడు మానవుని సృజించినప్పటికీ, జీవముగా నున్న దేవుని లేక సాతానుని తీసికొనుటకు మానవునికి ఎంచుకొనుట ఇవ్వబడింది. తరువాత మానవునిలోనికి ప్రవేశించి మానవుని యందు పాపస్వభావముగా మారిన సాతానుని తీసుకోవడాన్ని మానవుడు ఎంచుకున్నాడు. మానవుడు తన సంఘటితమందు (తత్వమునందు) పాపి అయ్యాడు మరియు తన క్రియలయందు పాపములతో నిండియున్నాడు. ఇప్పుడు మానవుని యందు దుర్నీతిని ప్రేమించు మరియు నీతిని ద్వేషించు, అనగా పాపమును, చీకటిని ప్రేమించు మరియు వెలుగును ద్వేషించు  మూలకము ఉన్నది. మానవుడు ఇలా అవుతాడని దేవుడు ఆశించిన వాటన్నింటిలో, మానవుడు అలా అవ్వలేదు. దేవుని కలిగిలేని మానవుడు పాపమునందు నిలిచిపోయెను  మరియు దేవుని కలిగియుండడానికి, దేవుని సంప్రదించడానికి సృష్టించబడిన మానవుని భాగమైయున్న  తన ఆత్మయందు మృతి చెందెను. మానవుడు పశ్చాత్తాపము నొందకపోతే, నిత్యత్వమంతయు సాతానుతో ఉండి నాశనమగును.

దేవుని రక్షణ

అయితే దేవుడు, మానవులను ప్రేమించు తన మహా ప్రేమను బట్టి కరుణాసంపన్నుడై తాను సృజించిన మానవుడు సాతానుకి బలియవ్వడాన్ని చూచుటకు మరియు సాతానుతో పాటు అగ్నిగుండములో అంతమగుటకు ఇష్టపడుట లేదు. బాధిత మానవత్వముతో జతపరచబడి మానవునిగా అగుటకు, నాశనము నుండి మానవుని తప్పించు నిర్దోషమైన ప్రత్యామ్నాయముగా మరణించుటకు ఈ ప్రేమయే దేవుని ప్రేరేపించెను (రోమా 5:8). తరువాత ఆయన విశ్వసించు వారందరికీ, స్వీకరించువారికి జీవమిచ్చుటకు జీవమిచ్చు ఆత్మగా మారుటకు పునరుత్థానుడయ్యాడు (రోమా 4:25), (1 యోహాను 5:12).

నీవు ఆయనను నీలోనికి స్వీకరించినప్పుడు, ఆయన నీలోనికి దేవుని జీవమును తెచ్చును. దేవుడు నీ జీవముగా ఉండును మరియు నీతో ఏకమగును (1 కొరింథీయులకు 6:17). తరువాత నీ వ్యక్తిత్వము నంతటినీ నింపుటకు ఆయనను నీ యందు ఎదుగునట్లు అనుమతించాలి. ఇది నీ పుట్టుకనుండి నీలో ఉన్న సైతాను స్వభావము నుండి నిన్ను విడిపిస్తుంది. ఆయన నీలో ఎక్కువగా ఎదుగుకొలది, నీవు సాతాను యొక్క నిరంకుశపాలన నుండి విడిపించబడతావు. దేవుడు ప్రేమించునట్లుగా నీవు ప్రేమిస్తావు. దేవుడు నీతిమంతునిగా ఉన్న లాగున నీవు కూడా నీతిమంతునిగా అవుతావు. నీవు దేవుని యొక్క దైవికమైన లక్షణములన్నింటినీ అనగా ప్రేమ, వెలుగు, పరిశుద్ధత, దయ మొదలగు వంటివాటిని వ్యక్తపరుస్తావు.  భూమిపై దేవునితో, దేవుని యందు, దేవునితో ఏకమైన జీవితమును జీవించిన తరువాత నీవు తీర్పు వద్ద నిస్సందేహముగా అంగీకరించబడతావు (యోహాను 14:20). నీవు ఖచ్చితముగా దేవునితో జీవితమును కలిగియుంటావు ఎందుకనగా నీవు ఆయన నిత్యజీవమును ఈ భౌతికమైన జీవితమును జీవించుచుండగా ఆస్వాదించుచున్నావు (ప్రకటన 22:5,7).

నీవు దేవుని వైపుకు ఇంకనూ తిరుగని యెడల మరియు యేసు క్రీస్తు ద్వారా ఆయన జీవమును స్వీకరించని యెడల, నీ జీవితము ఇంకనూ సాతానుతో నింపబడియున్న యెడల, మరియు ఇప్పటికే శిక్షవిధింపబడిన యెడల (యోహాను 8:44), (ఎఫెసీ 2:12), (మత్తయి 25:41), (రోమా 1:28). నీవు మంచిని ఎంతగా చేయుటకు ప్రయత్నించినప్పటికీ, నీవు అంత మంచిగా ఉండలేవు. నీవు కొన్నిసార్లు నీతిమంతునిగా ఉండవచ్చును, అయితే అన్నివేళలూ ఉండలేవు. నీవు ప్రజలందరికీ ప్రేమను చూపించవచ్చును, గానీ వారిలో కొంతమందిని నిజముగా నీ హృదయమందు రహస్యముగా ద్వేషించవచ్చును. ఇదంతయు నీకు యధార్ధవంతునిగా ఉండుటకు కోరిక లేదని కాదు, గానీ దైవిక జీవము నిన్ను బలపరచుటను నీవు కొరతగా కలిగియున్నావు. దేవుడు దేవుడే మరియు సాతాను సాతానే. నీవు దేవుని కాకుండా సాతానుని కలిగియుంటే నీవు ఈ జీవితములో సంపూర్ణునిగా ఎప్పటికీ అవ్వలేవు, మరియు తీర్పు తరువాత ఖచ్చితముగా అగ్నిగుండమందు సాతానుతో ఉంటావు. దేవుడు నీయందు జీవించుటను కలిగియుంటే, నీవు ఈ జీవితములో దేవునియంత సంపూర్ణముగా అవుతావు, మరియు నీవు ఖచ్చితముగా నిత్యత్వమంతయు దేవునితో ఉంటావు మరియు దేవునితో ఒక్కటైయుంటావు (1 థెస్స 1:9-10), (ఆదికాండము 2:9), (ద్వితీ  30:19).  నీకేది అవసరమనగా ఆయన నామమును పిలుచుట చేత నీవు యేసును స్వీకరించాలి మరియు నీవు పాపివని ఆయన నీకు రక్షణగా అవసరమని నీవు ఒప్పుకోవాలి (రోమా 5:19), (రోమా 7:20), (రోమా 3:23), (రోమా 6:23), (యోహాను 4:24), (యోహాను 3:19), (యోహాను 12:46).

 ఈ విధంగా ప్రార్ధించు: ఓ ప్రభువైన యేసు, నీవు నన్ను సృష్టించావని యెరుగుదును. నేను పాపమును కలిగియున్నానని మరియు నీ జీవమును కలిగిలేనని యెరుగుదును. నీవు నా కొరకు మరణించావని నేను నమ్ముతున్నాను. ప్రభువైన యేసు, నా జీవముగా ఉండడానికి నాలోనికి రమ్ము. నేను నీతో ఇప్పుడును ఎల్లప్పుడును ఉండగోరుతున్నాను.

తరువాత నీవు ప్రతిదినము బైబిలును చదువవలసిన, ప్రతిదినము ప్రార్ధించవలసిన అవసరముండును ఏకత్వమందు విశ్వాసులను కలుసుకొనవలెను తద్వారా నీవు ఆయన లోనికి ఎదుగగలవు మరియు దేవుని ప్రజలతో నిర్మింపబడతావు  (1 పేతురు 2:2), (ఎఫెసీ 4:15), (1 యోహాను 3:14), (మార్కు 10:18), (ఫిలిప్పీయులకు 4:13), (ఫిలిప్పీయులకు 4:13), (మత్తయి 5:48), (రోమీయులకు 10:13). దీనిచేత, నీ గమ్యముపట్ల నీవు నిశ్చయతను కలిగియుంటావు (అపోస్తలుల కార్య 2:28).


ఇతరులతో పంచుకొనండి