ఎన్నటికీ విఫలమవ్వని నిరీక్షణను (ఆశను) మనము ఎక్కడ కనుగొనగలము?

ఎన్నటికీ విఫలమవ్వని నిరీక్షణను (ఆశను) మనము ఎక్కడ కనుగొనగలము?

మనము మన జీవమును జీవిస్తుండగా తప్పించుకోలేని మూడు ప్రతికూల విషయములు: వయస్సు పెరుగుట, వ్యాధి మరియు మరణమును ఎదుర్కొంటామని మనము నిశ్చయముగా చెప్పెదెము. మనము ఎంతగా మంచి ఆహారమును తీసుకొనుటకు సాధకము చేసినా మరియు  ప్రయత్నించినా ఈ గమ్యమును మనము తప్పించుకోలేము. మన జీవితములన్నీ తుదకు ముగింపునకు వచ్చును. మనము మరణించినపుడు ఏమి మిగిలి యుండును? ఏమీ మిగిలియుండదు. ఎంతో విజయవంతమైన ప్రజలు వారి వారసత్వపు సొత్తును విడిచిపెట్టుదురు. వారు ఇక ఎంత మాత్రము జీవించనపుడు వాస్తవానికి వారు ఏమి కలిగియుంటారు? ఈ సమయమందు వారు నెరవేర్చిన సమస్తము మరియు వారు కూడబెట్టినది  వ్యర్ధమే. మానవ జాతి నిరీక్షణ లేనిదని తప్పక ముగింపును ఇవ్వగలము. మన చిట్ట చివరి గమ్యముగా నున్న మరణముతో నున్న క్షీణించే పరిస్థితిలో ఇరుకున పెట్టబడ్డాము, అయినప్పటికీ మనము ఇంకా నిరీక్షణ కొరకు ఎదురుచూచుచున్నాము. మనము కనుగొనగలమా?

ప్రజలందరూ ఒక దాని కొరకు ఎదురుచూస్తారు లేక కొందరి మీద వారి నిరీక్షణను ఉంచుతారు. సాధారణముగా, మన నిరీక్షణ యొక్క విషయము మార్పు చెందుతుంది ఎందుకనగా ఆ విషయము ఓటమి చెందుతుంది మరియు నిత్యము నిలిచే నిరీక్షణను ఇచ్చుటకు సరిపోనిదిగా అవుతుంది.  నిరీక్షణలేమి యొక్క అంతము లేని చక్రములో మనము చిక్కుకున్నాము, మనలను విఫలమొందించని ఒక వస్తువును మనము కనుగొనలేకపోయాము. ఆయన ప్రతి అర్హత మరియు పరీక్ష గుండా పయనించిన, శాశ్వతముగా భద్రపరచు - దేవుని యందు మనము మన నిరీక్షణను ఉంచగలము. ఆయనే మన నిరీక్షణ యొక్క విషయమై యుండాలి.

ఆ కాలమందు,....నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. ఎఫెస్సీయులకు 2:12

మనము నిత్యుడగు దేవునిని కోల్పోతిమి గనుక మానవ జీవితము నిరీక్షణ లేనిదైయున్నది. దేవుడు లేకుండా, ఈ లోకమందు నిరీక్షణ లేదు. కానీ మనము దేవుని యొద్దకు తిరిగి  రాగలము మరియు నిరీక్షణను కనుగొనగలము. మానవునికి సమస్తముగా ఉండాలని, మన నిరీక్షణగానున్న తనతోనే మనలను నింపాలని మరియు నిరీక్షణా మార్గము లో మనలను ఉంచాలని దేవుడు కోరుతున్నాడు.

మన జీవితములో నిరీక్షణను మనము కనుగొనగలుగుటకు 4 మార్గములు ఇక్కడ ఉన్నాయి:

  1. మన లోపలి శూన్యత యొక్క లోతైన సంవేదనను మనము తప్పకుండా ఒప్పుకొని, అంగీకరించవలెను. ఈ సంవేదన నీకు, నీవు దేవున్ని పోగొట్టుకుంటున్నావని చెప్పుచున్నది. నీ జీవితము యొక్క నిరీక్షణగా ఉండుటకై దేవుడు నీకు అవసరము. బైబిల్లో, సొలొమోను అనే గొప్ప రాజు ఉండెను, అతడు ఈ లోకము ఇవ్వగలిగిన వాటన్నిటిని వెదికెను మరియు అనుభవించెను. అదంతా వ్యర్థతలకు వ్యర్థత అనియు, గాలికై పరుగెత్తుటనియు, ఈ సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదని అతడు నిశ్చయించి చెప్పాడు(concluded). మానవుని హృదయములో ‘‘నిత్యత్వమ’’నే ఒకదానిని దేవుడు ఉంచాడని కూడా అతడు చెప్పాడు. నిత్యత్వమనేది దేవుని కొరకైన ఒక లోతైన ఆశ, దానిని ఈ లోకముకు సంబంధించినదేదియు నింపలేదు-కేవలము దేవుడు మాత్రమే లోపలి శూన్యతనే సంవేదనను నింపగలడు మరియు తృప్తిపరచగలడు.
  2. దేవుడు మనకు సమస్తముగా ఉండగలడని మనము గుర్తించవలసిన అవసరమున్నది. మనము దేవున్ని వ్యక్తపరిచి, ఆయనకు ప్రాతినిధ్యము వహించాలని దేవుడు మనలను తన స్వరూపములో తన పోలిక చొప్పున సృజించెను. చేతి స్వరూపములో చేయబడిన చేతితొడుగు వంటివారము మనము, అయితే చేయి లేకుండా, మనము నిరుపయోగమైనవారము మరియు శూన్యులము. చేయిగా మనము దేవుని చేత నింపబడినప్పుడు, మన ఉద్దేశము నెరవేర్చబడుతుంది. కావున, మనలను సృజించుటలో ఉన్న ఆయన ఉద్దేశము నెరవేర్చుటకుగాను మనము మన జీవముగా దేవున్ని స్వీకరించవలసిన అవసరమున్నది. మన శూన్యతంతటిని నింపి, మరియు మనకు సర్వముగా ఉండగలిగేవాడు కేవలము దేవుడు మాత్రమే.
  3. మనము తప్పక పశ్చాత్తాపపడి మరియు దేవుని వైపుకు తిరుగాలి. ఈ లోకమును గూర్చి ఆలోచించుటలో మరియు మనము నిరీక్షణ యుంచు వాటియందు మార్పును కలిగియుండవలసిన అవసరమున్నది. ప్రభుత్వము, నాయకత్వము, మరియు ప్రపంచపరిస్థితి యందు మార్పు లేకపోవుట మనకు శాశ్వత నిరీక్షణను తెచ్చును. మనము ఎల్లవేళలూ నిరుత్సాహము నొందెదము. మానవుడు సాధించినవి లేక మానవ కృషి ఆంతర్యమందున్న శూన్యతను నింపలేవు. మనము ప్రయత్నించుటను గూర్చి పశ్చాత్తాపపడాలి మరియు దేవునివైపుకు తిరగాలి మరియు దేవుని స్వీకరించాలి.
  4. మనము తప్పక ప్రభువైన యేసు క్రీస్తును మన రక్షకునిగా మరియు నిరీక్షణగా స్వీకరించాలి. మనము యేసును కలిగియుంటే నిరీక్షణను కలిగియున్నట్లే, మరియు మన జీవితము సంపూర్ణ నిరీక్షణను కలిగియుంటుంది. మనయందు మన మహిమా నిరీక్షణగా నున్న క్రీస్తు ద్వారా దేవుడు తన మహిమా గుణాతిశాయములను తెలియపరచవలెనని కోరుతున్నాడు. మన నిరీక్షణకు ఒక గమ్యము ఉన్నది మరియు ఆ గమ్యము మహిమా గమ్యమైయున్నది – దేవుని మహిమలో శాశ్వతముగా జీవించుటయై యున్నది. కొలస్సీ 1:27 ఇలా చెప్పుచున్నది. “అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి” మన వ్యక్తిత్వమును తెరచుట ద్వారా మరియు ముందు ఉన్న ప్రార్ధన ద్వారా మనము యేసును స్వీకరించగలము:

“యేసూ ప్రభువా, నేను శూన్యుడనని మరియు నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నానని ఒప్పుకుంటున్నాను. నీకు వేరుగా ఏదియు మరియు ఎవరూ కూడా నా నిరీక్షణగా ఉండలేరని నేను గ్రహించాను. నీవు నా జీవముగా నా నిరీక్షణగా ఉండుమని అడుగుతున్నాను. నన్ను శూన్యత నుండి,క్షీణించుట నుండి, మరణము నుండి రక్షించమని నిన్ను వేడుకొంటున్నాను. యేసూ ప్రభువా, నిన్ను నా రక్షకునిగా, నిరీక్షణగా స్వీకరించడానికి నేను ప్రవేశాన్నిస్తున్నాను. నా నిరీక్షణగా, మహిమగా ఉండుటకు నీవు నాకు కావాలి.”

క్రీస్తును మన నిరీక్షణగా స్వీకరించిన తరువాత, ఆయనను ప్రేమించుట ద్వారా, ఆయనను మనలో యెదుగనిచ్చుట ద్వారా, మరియు దేవుని మహిమలోనికి మనము పూర్తిగా వెళ్ళుటకు అనుమతించుట ద్వారా మన నిరీక్షణగా ఉన్న ఈ వ్యక్తిని మనము చురుకుగా ఆస్వాదించవలసిన అవసరమున్నది.

మన జీవంగా ఉన్న క్రీస్తు మనలో నివసించడం ద్వారా నేడు మనం దేవుని పరిపూర్ణతను ఆస్వాదించడం మాత్రమే గాక, భవిష్యత్తులో దేవుని మహిమలోనికి ప్రవేశించగలుగుతాము (రోమా. 8:17; హెబ్రీ. 2:10) కాబట్టి, నేడు మనలో నివసించడం ద్వారా ఒకవైపు ఆయన మన జీవము గాను, మరొక వైపు ఆయన మన మహిమ నిరీక్షణ గాను ఉన్నాడు (కొలస్సీ. 3:4; 1:27). నేడు ఆయన మన జీవముగా మనలో నివసిస్తున్నాడు అంటే తన యందున్న దేవుని జీవం ద్వారా, మనం ఎదిగి దేవుని పోలియుండునట్లును, దేవుని స్వరూపమునకు సమరూపము పొందునట్లును చేసి చివరికి దేవుని మహిమలోనికి ఎదుగునట్లు చేయును.
జీవమును గూర్చిన జ్ఞానము, Ch. 4

జీవమును గూర్చిన జ్ఞానము లో మీరు మరిన్ని విషయములు చదువగలరు. ఈ పుస్తకము మా ఉచిత పుస్తక సరణిలో అందుబాటులో ఉన్నది.

*All quotes © by Living Stream Ministry. Verses are taken from "The New Testament Recovery Version Online" at https://online.recoveryversion.bible


ఇతరులతో పంచుకొనండి