బైబిల్‌ను బోధించుటకుగాను మా పుస్తకాలలోనున్న అధ్యాయములను మీరు ఉపయోగించుకోవచ్చు
బైబిల్‌ను బోధించుటకైన పాఠాల కొరకు సరిగ్గా సరిపడే అధ్యాయములు మా పుస్తకాలలో ఉన్నాయి. మా పాఠాలన్నియు వచనముల రిఫరెన్స్‌లతో నిండుకొని యున్నవి, ఇవి పాఠాలను బైబిల్ యొద్దకు తిరిగి తీసుకొనివచ్చును మరియు పాఠాలన్నియు, ప్రాథమిక అంశములనుండి మధ్యస్థ అంశములకు మరియు మధ్యస్థ అంశముల నుండి వృద్ధిచెందిన అంశములకు పురోగమించును. మా పుస్తకాలలోనున్న పాఠాలు బైబిల్‌ను గూర్చి, క్రైస్తవ జీవితమును గూర్చి, దేవుణ్ణి గూర్చి, యేసును గూర్చి మరియు అనేకమైన అంశాలను గూర్చిన పర్యావలోకనమును అందించును.ఈ పాఠములను, వ్యక్తిగత అధ్యయనమునకు సాధనముగాను, చిన్న గుంపుల బైబిల్ అధ్యయనముల కొరకును లేదా పెద్ద గుంపు పర్యావరణములో బైబిలును బోధించుటకును ఉపయోగించవచ్చును; ఇవి, కొన్ని బైబిల్ పాఠశాలల చేత పాఠ్య ప్రణాళికగా కూడా ఉపయోగించబడుచున్నవి.
మన పుస్తకాలలో ప్రతిదీ బైబిల్ వచనముల రిఫరెన్స్‌లతో నిండుకొని ఉంది, ఇది మా పుస్తకాలలోనున్న అంశాలను మీరు లోతుగా అధ్యయనము చేయుటకు సహాయపడును. మా పుస్తకాలలోనున్న అంతరాంశములు బైబిల్‌ను ఆధారము చేసుకొని ఉన్నవి మరియు మా పుస్తకాలలోని అంతరాంశములను వెదకుటకు మరియు బైబిల్‌ను అర్థం చేసుకొనుటకు రిఫరెన్స్‌లు సహాయమునందించును. మా పుస్తకాలను చదువుట మరియు దానితో పాటుగానున్న బైబిల్ వచనాలను చదువుట అన్నది లోతుగా అధ్యయనము చేయుటకు అద్భుతమైన మార్గము.
మానవ జీవితము యొక్క మర్మము అని పిలువబడే క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి 1కి చెందిన మొదటి అధ్యాయముకు సంబంధించిన ప్రతి విభాగములో ఉపయోగించబడిన వచనముల రిఫరెన్సుల ఉదాహరణ ఇక్కడ ఉంది.