ఈ ఉచిత పుస్తకములు లోతైనవి, సులువైనవి, మరియు జీవితమును మార్చివేయునవి. మా ఉచిత క్రైస్తవ సాహిత్య సరణిలోని పుస్తకములన్నిటిని చదువుము మరియు నీ యొక్క దేవుని వెంబడింపులో అధిక సహాయమును పొందుకొనుము
క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు; ఒకటవ సంపుటి
మానవుని యెడల దేవుని ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఈ పుస్తకము సహాయము చేయును. నూతన క్రైస్తవులకుమరియు అనుభవము గల క్రైస్తవులకు అత్యవసరమైన నాలుగు కీలకమైన అనుభవములను ఈ పుస్తకము ఇచ్చుచున్నది, ఐశ్వర్యవంతమైన మరియు అర్థవంతమైన క్రైస్తవ జీవితమును జీవించుటకు గల గట్టి పునాదిని వేయుటకు సహాయపడును.
క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు; రెండవ సంపుటి
ప్రతి ఉదయము ప్రభువుతో ఏకాంతముగా సమయమును గడుపుట అనునది ప్రభువుతో మనకున్న సంబంధము మధురముగా మరియు వ్యక్తిగతముగా ఉండునట్లు చేయును. ఈ సమయము, నీవు నీ క్రైస్తవజీవితములో పురోగమించే రీతిలో మరియు శక్తివంతమైన రీతిలో ముందుకు వెళ్ళునట్లు చేయును. ఈ పుస్తకమును చదువుట ద్వారా, ప్రభువుతో ఈ సమయమును కలిగియుండుట ఎంత సులువో కనుగొనుము.
సర్వము-ఇమిడియున్న క్రీస్తు
ఇట్టి "సర్వము ఇమిడియున్న క్రీస్తు" లోనికి ప్రవేశించే మునుపు క్రీస్తు ఎంత అపరిమితమైనవాడు అనేదానిని మనము చూడవలెను. చూచుటకు మరియు ప్రవేశించుటకు ఈ పుస్తకము సహాయము చేయును. ద్వితీయోపదేశకాండము యొక్క ఈ వ్యాఖ్యానములో, తన విశ్వాసులకు క్రీస్తు ఏమైయున్నాడు అనే చిత్రము, మంచి దేశము అనే అద్భుతమైన చిత్రములో ఎలా చూపబడినదో చూడుడి.
దేవుని ప్రణాళిక
బైబిలంతయు దేవుని నిత్య ప్రణాళికను మరియు ఆయన దానిని ఎలాగు నెరవేర్చునో వివరించును. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ ప్రణాళికను దేవుడు తనంతట తానే నెరవేర్చుటకు ఇష్టపడడం లేదు. మానవుని కలుపుకొనుటకు ఆయన నిర్ణయించుకొనెను. క్రీస్తులోనున్న విశ్వాసులముగా మనమందరము దేవుని ప్రణాళికలో భాగస్థులమే. కావున, ఈ ప్రణాళికలో ఎలాగు పాలొందుతావు? ఈ ఉద్దేశ్యములో మనము ఎంత ప్రాముఖ్యమైన వారమో చూచుటకు ఈ పుస్తకమును చదవండి.
క్రైస్తవ జీవితం యొక్క ప్రాథమిక విషయాలు; మూడవ సంపుటి
మంచి చెడు నియమములతో మనలను మనము మలచుకొనునట్లు సమాజము భోదించును, కానీ దీనిని గూర్చి బైబిలు ఏమని భోదిస్తుంది? మనము జీవించగల ఒక ఉన్నతమైన నియమమును బైబిలు మనకు చూపుచున్నది: జీవపు నియమము. దేవుని నిత్యప్రణాళికను నెరవేర్చుటకుగాను మనము ఈ నియమముచే నడువాలని దేవుడు కోరుకొనుచున్నాడు.
జీవమును గూర్చిన జ్ఞానము
జీవమందు ఎదుగుటకు, జీవమంటే ఏమిటో, అది ఎక్కడ నుండి వస్తుందో మరియు ఈ జీవమును ఎలాగు పొందుకోవాలోమనకు తెలిసియుండాలి. ప్రవర్తనను మెరుగుపరచుకొనుట, కేవలము జ్ఞానమును, ఈవులను శక్తిని వృద్ధి చేసుకోవడమన్నది సమాధానము కాదు. జీవమందు ఎదుగుటకు జ్ఞానమును మరియు నడిపింపును సంపాదించుకోండి.
మహిమ గల సంఘము
‘‘సంఘము’’ అనే మాటను మనము విన్నప్పుడు, మానవ భావనలతో మన తలంపు నిండుకొని ఉందని కూడ మనము గ్రహించలేకపోవచ్చు. దేవుడు సంఘమును ఎలాగు చూస్తున్నాడో మీకు చూపించుట చేత ఈ పుస్తకము మీ తలంపులను నూతనపరచును. బైబిల్ నాలుగు విశిష్టమైన సాదృశ్యములను మనకు చూపును, అవి సంఘమును గూర్చి దేవుని దృష్టికోణమును మనకు చూపును. మీ అవగాహనను పరిమితి చేయకండి. మహిమకరమైన రీతిలో సంఘమును చూచుటకు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము.
మా చేత పంచబడిన పుస్తకముల యొక్క గ్రంథకర్తలు వాచ్‌మెన్ నీ మరియు విట్‌నెస్ లీ. వాచ్‌మెన్ నీ మరియు విట్‌నెస్ లీ గార్ల పరిచర్యను గూర్చి ఇక్కడ చదవండి