క్రీస్తు దేహమునకు వాచ్మెన్ నీ గారు, అతని జతపనివాడైన విట్నెస్ లీ గారు చేసిన పరిచర్య ఎనభై సంవత్సరములకు పైగా భూ ఖండములన్నిటిలోనున్న ప్రభువు పిల్లలకు ఆశీర్వాదముగా ఉన్నందుకు ప్రభువుకు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. వారి రచనలు అనేక భాషలలోనికి తర్జుమా గావించబడెను. మా పాఠకులు వాచ్మెన్ నీ గారి గురించి, విట్నెస్ లీ గారి గురించి అనేక ప్రశ్నలను మమ్ములను అడిగిరి. వారి ప్రశ్నలకు జవాబులుగా ఈ ఇద్దరి సోదరుల యొక్క జీవితము మరియు పనిని గూర్చి ఈ సంక్షిప్త వివరణను మేము అందిస్తున్నాము.
ఈ ఇద్దరి సహోదరులకు చెందిన పరిచర్య యొక్క ముఖ్య లక్షణమేమనగా వారు బైబిల్ యొక్క నిర్మలమైన వాక్యము ప్రకారముగా సత్యమును బోధించుటయే.
వాచ్మెన్ నీ గారు పదిహేడవ యేట క్రీస్తును స్వీకరించెను. ఆయన పరిచర్య ప్రపంచమంతటనున్న అన్వేషించే విశ్వాసులకు సుపరిచితము. అనేకులు ఆత్మీయ జీవితము మరియు క్రీస్తునకు ఆయన విశ్వాసులకు మధ్యనున్న సంబంధము అనువాటిని గూర్చి ఉన్న తన రచనల నుండి సహాయము పొందిరి. అయినను అనేకులు ఆయన పరిచర్యలో అంతే ప్రాముఖ్యమైన మరొక అంశమును గూర్చి ఎరుగరు. అది సంఘజీవనమును ఆచరించుట మరియు క్రీస్తు దేహమును నిర్మించుట అను విషయమాన్ని నొక్కిచెప్పుచున్నది. సోదరుడు నీ గారు క్రైస్తవ జీవితము మరియు సంఘ జీవనము అను వాటికి సంబంధించి అనేక పుస్తకములను వ్రాసెను. తన జీవితాంతము వరకు వాచ్మెన్ నీ గారు దేవుని వాక్యములోనున్న ప్రత్యక్షతను బయలుపరచుట కొరకు ప్రభువు చేత ఇవ్వబడిన ఒక వరముగా ఉండెను. చైనా ప్రధాన భూ భాగములో ప్రభువు కొరకు ఇరవై సంవత్సరముల పాటు జైలులో శ్రమలు అనుభవించిన తరువాత అతడు యేసుక్రీస్తు యొక్క నమ్మకమైన సాక్షిగా 1972లో మరణించెను
బైబిలును తెలుసుకొనుటకు, క్రీస్తును గూర్చి నేర్చుకొనుటకు మా పుస్తకములు సహాయపడగలవు, మరియు మీ క్రైస్తవ జీవితముకు ఆచరణీయమైన సహాయమును అందిస్తాయి. ఈ శ్రేణిలో, మూడు సెట్లుగా ఏడు పుస్తకములు ఉన్నాయి. ఈ శ్రేణిలోనున్న విషయాలు పురోగమనములో మరియు ప్రతి ఒక్కరికీ అద్భుతమైన సరఫరాగా ఉండును.
అధికముగా నేర్చుకొనండి