విట్నెస్ లీ గారు, వాచ్మెన్ నీ గారి యొక్క అత్యంత సన్నిహితమైన, అత్యంత నమ్మకమైన జతపనివాడు. 1925లో తన 19వ యేట అతడు శక్తివంతమైన ఆత్మీయ పునర్జన్మను అనుభవించెను మరియు సజీవమైన దేవుని సేవించుటకుగాను తన్నుతానే ఆయనకు సమర్పించుకొనెను. ఆ సమయమునుండి అతడు బైబిలును అత్యధికంగా చదువుటకు ఆరంభించెను. తన క్రైస్తవ జీవితములో మొదటి ఏడు సంవత్సరాల కాలముపాటు అతడు ప్లైమౌత్ బ్రదరన్ వారి చేత బహుగా ప్రభావితము చేయబడెను. తరువాత అతడు వాచ్మెన్ నీ గారిని కలుసుకొనెను. తరువాత 17 సంవత్సరాలు అనగా 1949 వరకు అతడు చైనాలో సోదరుడు నీ గారికి ఒక జతపనివాడుగా ఉండెను. రెండవ ప్రపంచ యుద్ధ కాలములో చైనా జపాను చేత ఆక్రమించబడినప్పుడు అతడు జపానీయుల చేత చెరసాలలో వేయబడెను మరియు ప్రభువునకు చేయు తన నమ్మకమైన సేవ కొరకు శ్రమపడెను. ఈ ఇద్దరు దేవుని సేవకుల యొక్క పరిచర్య మరియు పని చైనాలో క్రైస్తవుల మధ్య ఒక గొప్ప ఉజ్జీవమును తీసుకువచ్చెను. దాని ఫలితముగా సువార్త దేశమంతటా వ్యాపించెను మరియు వందల కొలదీ సంఘములు కట్టబడెను
1949లో వాచ్మెన్ నీ గారు చైనాలో ప్రభుని సేవిస్తున్న తన జతపనివారినందరిని కూడిరమ్మని పిలిచెను మరియు చైనా మధ్య భాగము బయటనున్న తైవాన్ అనే ద్వీపములో తన పరిచర్యను కొనసాగించమని విట్నెస్ లీ గారికి ఆజ్ఞాపించెను. ఆ తదుపరి సంవత్సరముల కాలములో దేవుని ఆశీర్వాదము వలన తైవాన్లో మరియు ఆసియా మధ్య ప్రాచ్యములో వందకంటే పైగా సంఘములు స్థాపించబడెను
1960 ప్రారంభములో విట్నెస్ లీ గారు అమెరికా దేశమునకు వెళ్లుటకు ప్రభువు చేత నడిపించబడెను. అక్కడ అతడు 35 సంవత్సరాలకు పైగా ప్రభువు బిడ్డల ప్రయోజనార్థము పరిచర్య చేసెను మరియు పని చేసెను. అతడు కాలిఫోర్నియాలో ఏనహ్యమ్ అనే పట్టణమునందు నివసించెను. 1974 నుండి 1997 జూన్లో ప్రభువుతో నుండుటకు వెళ్లేవరకు అచ్చటనే ఉండెను. అనేక సంవత్సరాలు అమెరికాలో తాను చేసిన పని ద్వారా అతడు 300 పైగా పుస్తకములను ప్రచురించెను
విట్నెస్ లీ గారి యొక్క పరిచర్య క్రీస్తు యొక్క శోధింపశక్యముగాని ఐశ్వర్యములను అనుభవించవలెనని మరియు వాటిని గూర్చిన లోతైన జ్ఞానము కావాలని కోరుకొనే అన్వేషకులైన క్రైస్తవులకు సహాయకరముగా ఉన్నది. లేఖనములన్నిటిలోనున్న దైవిక ప్రత్యక్షతను తెరచుట వలన సోదరుడు లీ గారి పరిచర్య సర్వములో సర్వమును నింపుచున్నవాని సంపూర్ణతగానున్న ఆయన దేహమైన సంఘము నిర్మించబడుట కొరకైన క్రీస్తును ఎరుగడం అన్న దానిని బయలుపరచును. విశ్వాసులందరు, క్రీస్తు దేహము నిర్మించబడుట అనే ఈ పరిచర్యలో పాలుపొందవలెను. తద్వారా ఈ దేహము ప్రేమయందు తననుతాను నిర్మించుకొనును. ఈ నిర్మాణమును సంపూర్తి చేయుట వలన మాత్రమే ప్రభువు ఉద్దేశము నెరవేర్చబడగలదు మరియు ఆయన హృదయము తృప్తినొందగలదు
బైబిలును తెలుసుకొనుటకు, క్రీస్తును గూర్చి నేర్చుకొనుటకు మా పుస్తకములు సహాయపడగలవు, మరియు మీ క్రైస్తవ జీవితముకు ఆచరణీయమైన సహాయమును అందిస్తాయి. ఈ శ్రేణిలో, మూడు సెట్లుగా ఏడు పుస్తకములు ఉన్నాయి. ఈ శ్రేణిలోనున్న విషయాలు పురోగమనములో మరియు ప్రతి ఒక్కరికీ అద్భుతమైన సరఫరాగా ఉండును.
అధికముగా నేర్చుకొనండి