ఎన్నటికీ విఫలమవ్వని నిరీక్షణను (ఆశను) మనము ఎక్కడ కనుగొనగలము?
మన జీవితాన్ని మనము జీవిస్తూఉండగా, మనమందరమూ అనారోగ్యమును, ముసలితనమును, చివరికి మరణమును అనుభవిస్తాము. మనము మరణించినప్పుడు, ఏమియు వదిలిపెట్టము. అత్యంత విజయవంతులు వారి వారసత్వపు ఆస్థిని వదిలివెళ్ళినప్పటికీ, వారింకెంత మాత్రమూ బ్రతికియుండరు గనుక వారేమి చేయుదురు? ఈ సందర్భములో సాధించిన మరియు కూడబెట్టిన ప్రతిదీ వ్యర్ధమే. మానవ జీవితమనేది ఆశలేనిది, అయినప్పటికీ మనము ఇంకా నిరీక్షణ కొరకు ఎదురు చూస్తుంటాము. ప్రతి అర్హత మరియు పరీక్ష గుండా ప్రయాణించిన, శాశ్వత భద్రతయైయున్న ఒక వ్యక్తి మీద మనము మన నిరీక్షణను ఉంచగలము – ఆయనే దేవుడు. దేవుడు ఏ విధముగా మీ నిరీక్షణగా ఉండగలడో కనుగొనండి.